అమరావతికి దారేది !? -seed access road from undavalli to amaravati - Tolivelugu

సీడ్ యాక్సెస్ రోడ్డుకు వైసీపీ గ్రామం ఉండవల్లి దారిస్తుందా? సీడ్ యాక్సెస్ రోడ్డు ఆటంకాలు తొలగుతాయా? సీఎం చొరవతో సీడ్ యాక్సిస్ రోడ్డుకు భూసేకరణ సమస్యలు పరిష్కారమవుతాయా? అంతకుముందు సాధ్యం కాని రోడ్డునిర్మాణం ఉండవల్లి ఏరియాలో ఇప్పుడు జగన్ సర్కార్ లో సాధ్యమవుతుందా? ఈ ప్రశ్నలు చర్చనీయాంశమయ్యాయి., అమరావతికి దారేది !?
సీడ్ యాక్సిస్ రోడ్డు తొలిదశ దొండపాడు నుంచి ఉండవల్లి కొండవీటివాగు లిఫ్ట్ దగ్గర నీళ్ల ట్యాంక్ వరకు 18.3 కి.మీ. దూరం 252 కోట్ల వ్యయంతో ఎన్. సి.సి. చేపట్టడం జరిగింది. ఇది ప్రస్తుతం దొండపాడు నుంచి కృష్ణాయపాలెం వరకు 14 కి.మీ. అక్కడక్కడ కొంత మినహా పూర్తయింది. రాయపూడిలో 300 మీటర్లు భూసేకరణ సమస్యతో, దొండపాడు దగ్గర లోకల్ రోడ్స్ సమస్యతో 100 మీటర్లు పెండింగులో ఉంది. దొండపాడు నుంచి వెంకటపాలెం మీదుగా కృష్ణాయపాలెం వరకు పూర్తయిన సీడ్ యాక్సిస్ రోడ్డు అక్కడి నుంచి ఉండవల్లి వరకు భూసేకరణ సమస్యతో ఆగింది.
దీనికి వైసీపీ ప్రభుత్వం రైతుల్ని ఒప్పిస్తే పరిష్కారం దొరుకుతుంది.
ఇక సెకండ్ ఫేస్ సీడ్ యాక్సిస్ రోడ్డు జాతీయ రహదారిపై లింక్ చేసే మార్గం ఇంకా మొదలుకాలేదు. దీనికి భూసేకరణ సమస్యలు, పలు అభ్యంతరాలున్నాయి.
సీడ్ యాక్సిస్ రోడ్డు ఆటంకాలు తొలగి ముందుకు కదలాలంటే సాక్షాత్తు సీఎం జగన్ చొరవ చూపాల్సిందే. లేకుంటే సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తికావడం కష్టమే. అమరావతికి రాజమార్గం అసంపూర్ణమే. దీనిపై సీఎం స్పందిస్తారా? లేదా? అనేది ప్రశ్నార్ధకమే?
For more information go for this link :https://tolivelugu.com

Comments

Popular posts from this blog

కేసీఆర్ కీలుబొమ్మ జగన్ ! - Tolivelugu

Sye Raa’, not a biopic! - ‘Sye Raa’ not a biopic!- Tolivelugu